షార్ట్ ఫిల్మ్‌తో సెగలు పుట్టిస్తున్న రాధిక ఆప్టే
పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలుసు . ఆ సినిమాలో ‘అహల్య అమాయకురాలు’ ఎపిసోడ్‌లో పవన్ అండ్ గ్యాంగ్.. బ్రహ్మీని బకరా చేసి బంతాట ఆడుకునే ఫన్నీ సీన్స్‌కు.. ఆడియెన్స్ నుంచి ఎలా రెస్పాన్స్ వచ్చిందో తెలియని విషయం కాదు .
అహల్య క్యారెక్టర్‌లో సమంత చెప్పే ‘స్వామి నదికి పోలేదా..’ అనే డైలాగ్ ఇన్ స్టంట్ హిట్ అయింది. ఈ డైలాగ్ సోషల్ మీడియాలో ఇప్పటికీ హల్ చల్ చేస్తూనే ఉంది. అత్తారింటికి దారేది మూవీలో మేజర్ కామెడీ రోల్ ప్లే చేసిన అహల్య క్యారెక్టర్ పై కహానీ డైరెక్టర్ సుజయ్ ఘోష్ మనసుపడినట్టున్నాడు . సుజయ్ ఘోష్ తన బెంగాలీ షార్ట్ ఫిల్మ్‌కు అహల్య పేరు పెట్టుకున్నాడు . ఈ షార్ట్ ఫిలిం ట్రైలర్‌ని రిలీజ్ చేసాడు దర్శకుడు .
మూవీ లవర్స్ అహల్య ట్రైలర్‌లో రాధికా ఆప్టే సెక్సీ ఫిగర్ చూసి షాకవుతున్నారు . రాధికా ఆప్టే ఇంత హాట్‌గా ఉంటుందా అని ఈ అప్సరసపై మనసు పారేసుకుంటున్నారు ప్రేక్షకులు . సెక్సీ అహల్యగా హీట్ పెంచుతున్న రాధిక ఆప్టే షార్ట్ ఫిల్మ్ టాలీవుడ్‌లోనూ డబ్ అయితే.. ఇంక సమంత చేసిన అహల్య రోల్‌ను అందరూ మర్చిపోతారని సినీజనాలు టాక్ .