నిన్నటిదాకా భార్యా భర్తలు , గర్భవతి అయిన తరువాత అన్నా చెల్లెలు ? ఎవరు? ఎక్కడ?

 naadu dampatulu: anna, chellini chesina gotram

వివాహం చేసుకుని సంతోషంగా ఉన్న దంపతులు ఒక్క సారిగా షాక్ కు గురైనారు. ఇక ముందు మీరు అన్నా, చెల్లిగా జీవించాలని పంచాయితీ పెద్దలు తీర్పు చెప్పడంతో దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు విచారంలో మునిగిపోయారు. హర్యానాలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విదంగా ఉన్నాయి. ప్రవీణ్, పూనం అనే ఇద్దరి వివాహం పెద్దలు నిశ్చయించారు. 

ఐదు నెలల క్రితం ప్రవీణ్, పూనం ల వివాహం సాంప్రదాయ బద్ధంగా వైభవంగా జరిపించారు. ప్రవీణ్, పూనం కుటుంబ సభ్యులు అప్పటి నుండి సంతోషంగా ఉన్నారు. ఇటీవల పూనం గర్బవతి అయ్యిందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు పండుగ చేసుకున్నారు. సంప్రాదయంలో భాగంలో ఇద్దరు గోత్రాలు తెలుసుకుని పూజలు చెయ్యాలని నిర్ణయించారు. 

అంతే అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ప్రవీణ్ ది కౌశిక్ పట్వాడియా గోత్రం, పూనంది కౌశిక్ పట్వాలియా గోత్రం అని వెలుగు చూసింది. ఈ గోత్రం ఉన్న వారు అన్నా చెల్లిగా బ్రతకాలని పంచాయితీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. పంచాయితీ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని తాము పాటిస్తామని ప్రవీణ్, పూనం అంగీకరించారు.ఈ నిర్ణయంతో ఇరు కుటుంబ సభ్యులకు విషాదం మిగిలింది. పెళ్లికి ముందే ఈ గోత్రం విషయం తెలుసుకుని ఉంటే ఇంత వరకు వచ్చేదికాదని పెద్దలు అంటున్నారు