ఆడుతూ పాడుతూ అల్లరిగా
తిరిగే తొమ్మిదేళ్ల కొడుకు శ్యామ్ హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. ఎక్కడా, ఎక్కడా
? అని వెతుకుతున్న ఆ తల్లికి ఆకాశం నుంచి హెల్ప్...హెల్ప్...అంటూ గాలి మాటున లీలగా
కొడుకు గొంతు వినిపించింది. తల పెకైత్తి చూడగా బోచ్ ఒడ్డున కొండపై 40 అడుగుల
ఎత్తుపైన చిక్కుకున్న కొడుకు కనిపించాడు.
కేట్ ఆర్మ్స్‌బై అనే 39 ఏళ్ల ఆ తల్లి
కొడుకును రక్షించడం కోసం కొండ ఎక్కడం ప్రారంభించింది. పర్వతాలు ఎక్కడంలో ఎలాంటి
అనుభవం లేకపోయినప్పటికీ కొండపై చిక్కుకున్న కొడుకును ఎలాగైనా రక్షించాలనే
తాపత్రయంతో జారుతున్న రాళ్లనే పట్టుగా చేసుకొని ఎంతో పట్టుదలతో పైకి చేరుకుంది.
కొడుకును అక్కున చేర్చుకుంది. అంతే....అక్కడి నుంచి కిందకు దిగడానికిగానీ,
పెకైక్కడానికిగా ఎలాంటి మార్గం కనిపించలేదు. కొడుకును రక్షించబోయి తాను 40 అడుగుల
ఎత్తుపై చిక్కుకు పోయింది.
హెల్ప్...హెల్ప్....అంటూ అరవడం ఇప్పుడు తనవంతయింది.
బీచ్ ఒడ్డునే ఉన్న కేట్ భర్త బీచ్ వద్దనున్న తోటి పర్యాటకుల సహాయాన్ని అర్థించాడు.
ఎవరికి ఏం చేయాలో తెలియలేదు. నావెల్ హెలికాప్టర్‌కు ఫోన్ చేయాలని ఎవరో సలహా
ఇచ్చారు. ఎలా ఫోన్ చేయాలి ? అక్కడి ఎవరి ఫోన్లకుసిగ్నల్స్ అందడం లేదు. కేట్ భర కిలోమీటర్ దూరం వరకు
పరుగెత్తికెళ్లి అక్కడ సిగ్నల్స్ దొరకడంతో ఫోన్ చేశారు. కార్న్‌వాల్ నుంచి 'సీ
కింగ్' హెలికాప్టర్ వచ్చి కొండపై చిక్కుకున్న తల్లీ కొడుకులను రక్షించారు.
రిస్క్యూ ఆపరేషన్ పూర్తవడానికి మొత్తం మూడు గంటలు పట్టింది. అప్పటి వరకు తల్లీ
కొడుకులిద్దరు బిక్కుబిక్కుమంటూ కొండరాయిపైనే గడిపారు.
ఇలాంటి సందర్భాల్లో
రక్షించడానికి తాముండగా, మీరెందుకు రిస్క్ తీసుకుంటారని హెలికాప్టర్ సిబ్బంది ఆ
తల్లిని హెచ్చరించి వెళ్లిపోయారు. మొత్తం ఆపరేషన్‌ను తోటి పర్యాటకులు తమ
కెమేరాల్లో బంధించారు. వెస్ట్ యార్క్‌షైర్‌లోని హెబ్డెన్ బ్రిడ్జ్ ప్రాంతానికి
చెందిన కేట్ కుటుంబం సౌత్ డెవాన్ ప్రాంతానికి విహారానికి ఇటీవల వెళ్లినప్పుడు ఈ
సంఘటన జరిగింది.