ముద్దు పెడితే కాన్సర్
రావడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా..? మీరు కాదు మీము కూడా ఆశ్చర్య పోయాం..కానీ ఇది
నిజం..ముద్దు పెడితే కాన్సర్ వస్తుందని తాజా పరిశోదనలో తేలింది.. ముద్దు లేదా చుంబనం
(Kiss) ఒక విధమైన ప్రేమను వ్యక్తం చేసే పద్ధతి. ముద్దు పెట్టుకునే వ్యక్తి తన రెండు
పెదవులతో మరొకరి శరీరంలో వివిధ భాగాల్ని సున్నితంగా స్పృశిస్తారు. ముద్దు పెట్టుకోవడం
ఒక క్లిష్టమైన ప్రక్రియ.
ముద్దు పెట్టుకొనేటప్పుడు సుమారు 34 ముఖ కండరాలు మరియు
112 ఇతర కండరాలు పనిచేస్తాయని అంటారు..అలా లిప్ టూ లిప్ కిస్ పెట్టడం వల్ల కాన్సర్
వస్తుందని ఓ పిడుగులాంటి వార్త తెలియజేసారు ఆస్ట్రేలియా లోని రాయల్ డార్విన్ హాస్పటల్
వైద్యులు.. ఆడ, మగ పరస్పరం పెదలఫై ముద్దు పెట్టుకోవడం వల్ల హ్యూమన్ పాపిల్లోమా అనే
కాన్సర్ కారకమైన వైరస్ ఒకటి, లాలాజలం నుండి మరొకరికి వస్తుందని తమ పరిశోదన లో తేలిందని
వైద్యులు చెపుతున్నారు.
ధూమపానం , మద్య పానం చేసేవారికే కాన్సర్ వస్తుందంటే తప్పు ఇలా
ముద్దు ద్వారా కూడా వస్తుందని చెపుతున్నారు..ఇక నుండి మీకు సంబదించిన వారిని ముద్దు
పెట్టుకునేటప్పుడు కాస్త అలోచించి పెట్టండి.