అంతా విప్పేస్తున్నాగా, ఆ మాత్రం ఇవ్వలేరా....శృతిహాసన్‌

shruti hassan కోసం చిత్ర ఫలితం
విలక్షణ నటుడు కమల్ హాసన్ కుమార్తెగా వెండితెరకు పరిచయమైన అందాల తార శ్రుతి హాసన్. అనతి కాలంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగి, తండ్రికి తగ్గ కూతురిగా పేరుతెచ్చుకుంది. ప్రస్తుతం ఏ హీరోయిన్‌కు లేనన్ని ఆఫర్లతో శ్రుతి బిజీగా ఉంది. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా గుర్తింపు పొందిన అమ్మడు చేతిలో ఇప్పుడు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిది చిత్రాలు ఉన్నాయట. 

తాజా సమాచారం ఏమిటంటే... నిన్న, మొన్నటి వరకు కోటి రూపాయలు పారితోషికం తీసుకుంటున్న శ్రుతి ఒక్క సారిగా రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. అంతటితో ఆగక నానా రకాల కండిషన్లు కూడా పెట్టేస్తుందట. హఠాత్తుగా ఇదేమి నిర్ణయం అని అడిగితే... దర్శకుడు ఎలా చెప్పితే అలా నటిస్తున్నాగా, అవసరమైన అంతా విప్పేస్తున్నాగా, ఆ మాత్రం ఇవ్వలేరా అంటూ వయ్యారాలు ఒలకబోస్తోందట. అయినప్పటికీ నిర్మాతలు మాత్రం వెనుకాడకుండా వెంటనే ఒప్పేసుకుని, సింగిల్ పేమెంట్‌తో బుక్ చేసుకుంటున్నారట. 

అలా ఓ బాలీవుడ్ నిర్మాత శ్రుతి అడిగిన రెమ్యునరేషన్‌ని ఇవ్వటమే కాదు ఆమె తెలిపిన అన్ని కండిషన్లకు కూడా ఒకే అన్నాడట. ఇంతకీ అమ్మడు పెట్టిన షరతులు ఏంటంటే… 7 స్టార్ హోటల్లో వసతి, ఫస్ట్ క్లాస్ విమాన టిక్కెట్లు ఇలా తనకు కావాల్సిన లిస్ట్‌ని నిర్మాత ముందు ఉంచిందట. ఈ లెక్కలన్నీ చూసుకుంటే రెమ్యునిరేషన్ రూ.2 కోట్లు అయ్యిందట.

ఎందుకు అన్ని కోట్లు ఇచ్చి శృతిని హీరోయిన్‌గా పెట్టుకున్నారంటని అడిగితే, శృతి నటించడమే కాదు పాటలు కూడాపాడుతుంది. పైగా ఎక్స్ పోజింగ్‌కు చేయడానికి ఏ మాత్రం వెనుకాడదు, ఇంకా చెప్పాలంటే బాలీవుడ్‌లో సోనాక్షి, ఆలియా లాంటి హీరోయిన్లే  రూ.5 కోట్లు మాత్రమే డిమాండ్ చేస్తున్నారట. అలాంటప్పుడు టాలెంట్ ఉన్న శృతిహాసన్‌ని పెట్టుకోవడం బెటరని భావించాడట ఆ చిత్ర నిర్మాత.