పురాణాల్లో దుస్తులిప్పిన దుశ్శాసనుడు ప్రతినాయకుడయ్యాడు. ఎక్కడ
రేప్ జరిగినా.. ఎక్కడ అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడ్డా వారిని ఇప్పటికీ దుశ్శాసనులుగా
అభివర్ణిస్తున్నాం. మరి బాహుబలి సినిమాలో ఓ పాటేసి.. నాలుగు సీన్లు పెట్టి అమ్మాయి
దుస్తులు ఒక్కొక్కటిగా విప్పేస్తుంటే దానిని హీరోయిజం అంటారా..?
అసలు మన దర్శకులు ఏమి
తీస్తున్నారు? మనం ఏం చూస్తున్నాం..? అంటూ ఓ ఎన్నారై తెలుగు చిత్రపరిశ్రమలోని దర్శకులను
కడిగిపారేసింది. ఎవరామె..? ఎప్పటినుంచో నన్ను ఇబ్బంది పెడుతున్న ఓ ప్రశ్న
గురించి మాట్లాడతానంటూ ఎన్నారై అన్నపూర్ణ సుంకర విడుదల చేసిన వీడియో నెట్‌లో హల్‌చల్
చేస్తోంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆడవాళ్లకు జరుగుతున్న అవమానాలను గురించి
ఎండగట్టారు.
చిత్రసీమలో జరుగుతున్న అరాచకాలను తీవ్రస్థాయిలో విమర్శించారు. అవంతిక
పాత్రలో ఉన్న తమన్నా దుస్తులను బాహుబలి పాత్రలో ఉన్న ప్రభాస్‌తో విప్పేయించే
దృశ్యాలు రేప్ కిందకు రాక మరేమవుతుందని ప్రశ్నించారు. దాని వెనుక రెండు సీన్లు...
ఓ పాటను జోడించి చూపితే ఎగబడి చూస్తున్నాం.. ఇది అమ్మాయిలకు జరిగిన అవమానం కాదా..?
అంత
అద్భుతమైన సినిమాలో కూడా అమ్మాయిలను అవమానపరచకుండా తీయలేకపోయారా...? అంటూ ఆవేదన
వ్యక్తం చేశారు. బాహుబలిని చెక్కిన జక్కన్నగా పేరు తెచ్చుకున్న రాజమౌళి రేప్ సీన్
చెక్కారా... ఇదేనా ఆయన చాతుర్యం..? అంటూ మండిపడ్డారు.
అత్తారింటికి దారేది సినిమాలో 40 యేళ్ళ పవన్ కళ్యాణ్ 60 యేళ్ళ ఎమ్మెస్ నారాయణను కొట్టడం, దానిని చూసి మనం నవ్వడం ఇదేనా కామెడీ.. ఇంకో సినిమాలో హీరో మహేష్ హీరోయిన్‌ను నీ కలరెక్కడ? నా కలరెక్కడ? అంటే అది కామెడీ.. అవుతుందా.. ఎదుటి వారిని బాధపెడితే తప్ప కామెడీని రూపొందించలేక పోతున్నారా.. అని ప్రశ్నించారు. ఓ షోలో ఆలీ ఓ యాంకర్‌పై చేసిన వ్యాఖ్యలను ఆమె నేరుగానే తిట్టిపోశారు. టాలివుడ్‌కు పట్టిన జాడ్యంపై దర్శకుల తలంటేశారు. నెటిజన్లు అన్నపూర్ణ పోస్ట్ చేసిన వీడియో గురించే పతాక స్థాయిలో డిస్కస్ చేస్తున్నారు.