నేనెక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నే
కోరుకు న్నా.. ఏమిటి పాత మధుర గీతాలు గుర్తు చేస్తున్నారనుకుంటున్నారా? నటుడు ఆర్య,
నటి నయనతార స్నేహం చూస్తుంటే అలాంటి పాటలు మీకు గుర్తు రాక తప్పదు. ఆర్యను ప్లేబాయ్
అంటారు. బిరియానీలతోనే హీరోయిన్లను మచ్చిక చేసుకుంటారంటారు.
ఆర్య మాత్రం ఇవన్నీ కొట్టిపారేస్తూ
తాను తన హీరోయిన్లతో స్నేహంగాను, సరదాగాను ఉంటాను. అది తప్పా? అంటూ ప్రశ్నిస్తారు.
అయితే హీరోయిన్లలో నటి నయనతార తనకు స్పెషల్ అనే ఆర్య ఆమె వివాహానికి మిమ్మల్ని ఆహ్వానిస్తారా?
అన్న ప్రశ్నకు తన దైన స్టైల్‌లో బదులిస్తూ నయనతార ఎక్కడున్నా బాగుండాలి. ప్రేమలో జయించినా,
లేకపోయినా ఆమె తన కెప్పుడూ మంచి స్నేహితురాలే. అందుకే నయన ఎక్కడున్నా ఆమె సుఖమే నే
కోరుకుంటానన్నారు.
సరే మీ వివాహం ఎప్పుడన్న ప్రశ్నకు నటుడు విశాల్ పెళ్లి తరువాతే నా పెళ్లి. అతనేమో నడిగర్ సంఘం భవన నిర్మాణం తరువాతే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అంతకుముందు ఆర్యను పెళ్లి చేసుకోనీయండి అంటూ నా మీద నేరం మోపుతున్నాడు. ఇప్పుడు నడిగర్ సంఘంపై నేరం మోపుతున్నాడు అంటూ చమత్కరించారు. ఇంతకీ నయనతార ఎవరిని? ఎప్పుడు పెళ్లి చేసుకుంటారన్నది కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారిన్ది.