జగన్ అనంతపురం జిల్లాలో తొలి విడత రైతు భరోసాయాత్ర చేపట్టినప్పుడు బాబు ప్రభుత్వం అర్జెంటుగా ఆత్మహత్యలు చేసుకొన్న రైతులకు నష్టపరిహారం పంపిణీ చేసింది. జగన్ ఏయే కుటుంబాలను పరామర్శించబోతున్నాడనే లిస్టును తీసుకొని.. జగన్ కన్నా ముందే మంత్రులు వెళ్లి పరిహారం అందించడం జరిగింది.
జగన్ రేపు ఏ కుటుంబాలకు వెళుతున్నాడు.. ఆ కుటుంబాలకు ఈరోజే స్థానిక ఎమ్మెల్యేలు వెళ్లి డబ్బు అందించి వచ్చారు. అలా ప్రతిపక్ష నేత చేపట్టిన రైతు భరోసాయాత్రకు చెక్ చెప్పడానికి వారు ప్రయత్నించారు. ఇక తాజాగా జగన్ అనంతలో కొన్ని కుటుంబాలను పరామర్శించి వచ్చిన నేపథ్యంలో ఆ కుటుంబాలకు కూడా పభుత్వం పరిహారాన్ని అందిస్తోంది.