అందరిలో ఆసక్తి రేపుతున్న హైడ్ గ్యాస్ నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా మార్చి ఇంధన ఉత్పత్తి అవసరమైనప్పుడే గ్యాస్ తయారీ భద్రత విషయంలో భయమేలేదంటున్న హైడ్ గ్యాస్ టీం ఎల్పీజీ గ్యాస్ కంపెనీలకు చెక్ చెప్పాలని భారీ లక్ష్యం
హైడ్ గ్యాస్ .. కరెంట్ సాయంతో నీటిని ఇంధనంగా ఉపయోగించుకుంటుంది. వాస్తవానికి చెప్పాలంటే ఇంధనాన్ని తనంతట తానుగా ఉత్పత్తి చేసుకొనే ఓ పొయ్యి(cooktop)ఇది. అవసరం అయినప్పుడు నీటిని ఆక్సిజన్, హైడ్రోజన్‌గా మార్చి ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుంది.దీంతో గ్యాస్ నిల్వ ఉంచాల్సిన పనిలేదు. గ్యాస్ బండలతో అసలు పనేలేదు. ఎల్పీజీతో పోలిస్తే ఇది ఎంతో సేఫ్. సోలార్ పవర్‌తో కూడా అనుసంధానిస్తున్నట్టు దీని తయారీ దారులు రిఇన్వో ల్యాబ్స్ ప్రకటించింది. ఇది తమకు గర్వంగా ఉందని రిష్విన్ ఎంహెచ్ చెబ్తున్నారు.
2014లో రిఇన్వో ల్యాబ్స్ స్టార్టప్ ప్రారంభమైంది. కాలేజీ పూర్తి చేసుకొని బయటకొచ్చిన కొంతమంది యువకులు పెట్టిన కంపెనీ ఇది. కాలుష్య రహిత క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనే ఆలోచన నుంచి మొదలైంది. రెయిన్(REIN ) రీ ఇన్వెంటింగ్ ద వరల్డ్ నుంచి తామీ కంపెనీ ప్రారంభించామని రిస్విన్ వివరించారు.
రిఇన్వో ల్యాబ్స్ వ్యవస్థాపకులు డిగ్రీ రెండో ఏడాదిలో వెబ్ సైట్లు, ఆండ్రాయిడ్ యాప్‌లు చేయాలని ఆలోచించేవారట. కానీ నేడు వాళ్లు అద్భతాన్ని చేసి చూపించారు. వాళ్ల సామర్థ్యంతో విప్లవాత్మకమైన హైడ్రోజన్ గ్యాస్‌ని మనముందుకు తీసుకువచ్చారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి వాటికెంతో ఆవస్యకత ఉంది.
కొన్ని గ్యాస్ ఏజెన్సీలు, ప్రభుత్వ చేతకాని తనం వల్ల గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌పై గుత్తాధిపత్యం ఎంతో క్రూరంగా తయారైంది. అవసరాలకు తగిన గ్యాస్ లభించకపోవడం, అనేది అటు పట్టణ వినియోగదారులనే కాదు ఇటు పల్లె జనాలను సైతం నిస్సహాయతకు గురి చేస్తోంది. గ్యాస్ సిలిండర్లు(బండలు) వల్ల జరిగే ప్రమాదాలు ఇక సరేసరి. ఇలాంటి ఎన్నో విషయాలు హైడ్ గ్యాస్ కార్యరూపం దాల్చడానికి ఆజ్యం పోశాయని తమ ఆలోచనలను ఆవేశంగా పంచుకుంటారు.
ప్రమాదం జరగడానికి అవకాశం శూన్యం. ఇదే హైడ్ గ్యాస్ మార్కెట్ అజెండా. నీటిని ఇంధనంగా ఉపయోగిస్తుంది కనుక ఆచరణాత్మకంగా చూస్తే కాలుష్యం కూడా సున్నా శాతమే.ఇక్కడ గ్యాస్ నిల్వ ఉండే అవకాశం లేదు కాబట్టి రక్షణ విషయంలో ఆందోళన కూడా లేదు. “ఉచితమేకాదు సురక్షితంగా వంటచేయొచ్చు” అని గర్వంగా చెప్పుకుంటారు.
రెండురకాల కస్టమర్లను తాము టార్గెట్ గా పెట్టుకున్నామని రిస్విన్ చెప్పారు.ఇందులో మొదటిది రెస్టారెంట్,హోటళ్లు. సాధారణ హోటళ్లు రోజుకి సరాసరి 3నుంచి 4 సిలిండర్లను ఉపయోగిస్తుంది. వినియోగంతో పోలిస్తే దీనికి ప్రత్యామ్నాయంగా హైడ్ గ్యాస్ ఎంతో లాభధాయకం అవుతుందని భావిస్తున్నాం. ఇకపోతే రెండో టార్గెట్ గృహ వినియోగదారులు. ఈ మార్కెట్ చాలా పెద్దది కావడంతో టార్గెట్ కస్టమర్లు వీళ్లేనని చెబ్తున్నారు.
ముందుగా హోటల్స్ లో ప్రొడక్టును సేల్ చేస్తాం. హోం వర్షన్ ప్రొడక్ట్ పై పరిశోధన – అభివృద్ధి కొనసాగుతోంది. అయితే మొత్తం ప్రాడక్ట్ బయటకి వచ్చే క్రమంలో ఎన్నో అవాంతరాలు. టీం కి సంబంధించిన రిలేటివ్స్ అనుభవాలను లెక్కలోనికి తీసుకున్నారు. హైడ్ గ్యాస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనే విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. పరిమిత సూచనల మేరకు డెవలప్ చేసి ప్రాడక్ట్ ఇది. ఇంటి అవసరాలకు దీన్ని అమ్మాల్సి వస్తే.. కచ్చితంగా ధరను తగ్గించాలనే నిర్ణయించుకున్నామని రిష్విన్ చెప్పారు. అన్నింటినీ అధిగమించి ఇప్పుడిక్కడికి వచ్చాం. వినూత్నంగా మార్కెటింగ్ చేసేక్రమంలో ఎలాంటి సమస్యలొస్తాయో చూడాలి.
ఇప్పటికైతే ఉన్న ఒకే ఒక్క క్లెయింట్ కెఫెటెరియా ఆఫ్ కుస్టా మాత్రమే.మార్కెట్ రెస్పాన్స్ బాగానే ఉందని రిష్విన్ అంటున్నారు. తామిప్పటికే కొంతమంది కార్పొరేట్ , హోటళ్లతో మాట్లాడారట. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఆసక్తి చూపడం తమలో భరోసా నింపిందని ఈ యువ బృందం ఉత్సాహంగా చెబ్తోంది.
మొదటి రెండు నెలలు రెయిన్వో ల్యాబ్స్ సొంత నిధులతోనే(సెల్ఫ ఫండెడ్)నెట్టుకొచ్చింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖతో పాటు స్టార్టప్ విలేజి నుంచి ప్రారంభ నిధుల(ఇనీషియల్ ఫండింగ్)సమీకరణ చేశారు. మరిన్ని నిధుల సమీకరణ కోసం చర్చలు జరుపుతున్నారు