భారత దేశ సాంప్రదాయ వంటకాల్లో ఉపయోగించే వస్తువులలో అతి ముఖ్యమైనవి మెంతులు. అందువలనే మన పూర్వికులు మన ఆహార పదార్థాల్లో మెంతులకు ముఖ్యత్వం ఇచ్చి ఉన్నారు. మెంతులను ప్రతి రోజూ ఆహారంలో తీసుకుంటూ వస్తే పురుషులకు సెక్స్ కోరికలు పెరుగుతాయి. మెంతులు పురుషుల సెక్స్ హార్మోన్‌లను రెచ్చగొట్టేందుకు సహకరిస్తాయి. మెంతుల్లో ఉన్న సపోనిన్ అనే పదార్థం పురుషుల సెక్స్ హార్మోన్ టెస్టోస్టిరన్ పనితీరును మెరుగుపరుస్తుంది.
ఈ విషయం తాజాగా జరిపిన అధ్యయనం ద్వారా మరోసారి రుజువైంది. ఇందుకోసం పరిశోధకులు ఇటీవల 25 ఏళ్ల వయస్సు నుంచి 55 ఏళ్ల వయస్సులోపు గల 60 మంది పురుషులను పరిశోధించారు. వారికి రోజుకు రెండు సార్లు వంతున మెంతులు, మెంతుల రసం ఇచ్చారు. ఆరు వారాల తర్వాత వారికి సెక్స్ కోరికలు అత్యధికంగా పెరిగినట్లు గుర్తించారు.