చైనా వాసులు పెద్ద సంఖ్యలో హాంగ్‌కాంగ్ ప్రాంతంలో వస్తువులను తమ వస్తువులను తీసుకు వస్తు విక్రయించి వెళుతుంటారు. చాలా కాలంగా అందుకు పలు వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల పెద్ద సంఖ్యలో ప్రజలు యెన్ లాంగ్ ప్రాంతంలో ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో నింగ్ లాయ్ ఇంగ్ అనే మహిళ కూడా పాల్గొంది.
అప్పుడు ఒక పోలీసు ఉన్నతాధికారి నింగ్ స్తనాలను పట్టుకున్నట్టు చెప్పబడుతుంది. దీంతో నింగ్ ఆ పోలీసు ఉన్నతాధికారిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆ కేసు విచారణ సమయంలో నిందమోపిన మహిళే తన స్తనాలను చూపుతో, తనపై దాడికి దిగింది అంటూ పోలీసు ఉన్నతాధికారి తరపు న్యాయవాది వాదించారు. దీంతో ఆమెకు మూడు నెలల 15 రోజులు శిక్ష విధిస్తూ ఆ దేశ కోర్టు తీర్పును ఇచ్చింది.
దీంతో తీవ్ర ఆవేశం చెందిన హాంగ్‌కాంగ్ ప్రజలు పెద్ద సంఖ్యలో కోర్టు ముందు చేరి వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. ఆందోళనలో పాల్గొన్న మహిళలు, పురుషులు అందరూ బ్రాలను ధరించి, స్తనాలను చూపుతూ నినాదాలు చేశారు.
దీంతో తీవ్ర ఆవేశం చెందిన హాంగ్‌కాంగ్ ప్రజలు పెద్ద సంఖ్యలో కోర్టు ముందు చేరి వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. ఆందోళనలో పాల్గొన్న మహిళలు, పురుషులు అందరూ బ్రాలను ధరించి, స్తనాలను చూపుతూ నినాదాలు చేశారు.