ఈ సబ్బు వాడండి..అందం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అనే ట్యాగ్ లైన్ తో వచ్చింది ఇందులేఖ( White Soap). దీని కోసం మళయాళ స్టార్ హీరో మమ్ముట్టి తో ఓ యాడ్ కూడా చేయించింది. ఆ యాడ్ లో మమ్ముట్టి చేత ఈ సబ్బు వాడండి అందం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పించింది. మన హీరో కూడా సింగిల్ టేక్ లో చెప్పేశాడు ఆ డైలాగ్ ను.
తన ఫేవరెట్ హీరో యాడ్ చూడగానే మార్కెట్ కు వెళ్లి ఆ సబ్బు కొనుక్కున్నాడు ఓ అభిమాని.. ప్రతి రోజు క్రమం తప్పకుండా అదే సబ్బు తో స్నానం చేస్తూ ఇక తన అందం రెట్టింపవుతుంది అనుకున్నాడు. కానీ వారాలు గడుస్తున్న హీరో చెప్పిన అందం మాత్రం తనను వెతుక్కుంటూ రాలేదు. దీంతో సదరు వ్యక్తికి తన అభిమాన హీరో మీద, సబ్బు కంపెనీ మీద కోపం వచ్చింది. వెంటనే కంన్జూమర్ ఫోరం ను ఆశ్రయించాడు.
తప్పుడు ప్రకటనలు ఇస్తూ తమను దోచుకుంటున్నారని కంప్లైట్ చేశాడు కేరళాలకు చెందిన ఛాతూ అనే వ్యక్తి. అంతే కాకుండా కంపెనీ నుండి 50 వేల రూపాయలు తనకు నష్టపరిహారం గా ఇప్పించాలని తన దరఖాస్తు లో పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన కేరళ.వయానాడ్ జిల్లా వినియోగదారుల కోర్టు .. సెప్టెంబర్ 22 లోపు ఆ యాడ్ లో నటించిన మమ్ముట్టిని,
ఆకంపెనీ ప్రతినిధులను కోర్టు ముందు హజరు కావాలని తెలిపింది. ఈ విషయం తెలిసినప్పటి నుండి నాకు సంతూర్ సోప్ మమ్మీ యాడ్ గుర్తుకొస్తుంది. వాస్తవికతకు దూరంగా ఉండే యాడ్స్ జనంపై గుమ్మరిస్తున్న కంపెనీలకు చురకలంటిచడానికి అక్కడక్కడ ఛాతూ లాంటివారు రెడీగా ఉంటారు.