లంకంత కొంప... 15 వేల కోట్ల ఆస్తి... కట్టుకున్నది వెళ్లిపోయింది.. ప్రేమించింది పారిపోయింది... ఏంటీ జీవితం..?

15 వేల కోట్ల రూపాయలకు యజమానిగా ఉన్న అతడి ఇల్లు ఎనిమిది బెడ్ రూంలు, అందమైన నగీషీలు కలిగిన ఫర్నిచర్‌తో 18 అడుగుల డైనింగ్ హాల్, 18 బాత్రూమ్‌లు, 16 కారు పార్కింగ్ గ్యారేజీలు, వాటిల్లో ఖరీదైన కార్లు, ఏ గదిలోంచి చూసినా అద్భుతంగా కనిపించే ఫసిఫిక్ మహాసముద్రం అలల అందాలు... మొత్తం 23 వేల చదరపు గజాల్లో అతడి సొంత భవనం రాజభవనాన్ని తలపిస్తుంది. 

ఇవన్నీ ఉంటే... ఏమనుకుంటాం...? ఇక అతడికి దిగులెందుకు అనే కదా... కానీ అతడు మాత్రం తనకు తృప్తి లేదని దిగాలు పడుతున్నాడు. స్వీడన్‌కు చెందిన మార్కస్ పర్సన్‌ ఒకప్పుడు అతి సామాన్యమైన వ్యక్తి.


ఏదో జీవితానికి కావలసిన డబ్బు కావాలని ఒకప్పుడు అనుకునేవాడు. అందుకోసం కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా ఉద్యోగంలో చేరాడు. దాని ద్వారా వచ్చే డబ్బు అతడికి తృప్తినివ్వలేదు. ఇంకా ఏదో చేయాలి... డబ్బు ఇంకా కావాలని అనిపించింది. దాంతో మైన్ క్రాఫ్ట్ అనే వీడియో గేమ్‌ను ఎంతో శ్రమించి కనుగొన్నాడు. ఈ ఆటను నెట్లో పెట్టేసరికి దాదాపు పది లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. కావల్సినంత డబ్బు వచ్చిపడింది. ఈ గేమ్ పట్ల ఉన్న క్రేజ్ ను గమనించిన మైక్రోసాఫ్ట్ కంపెనీ అతడి ముందు బంపర్ ఆఫర్ ఉంచింది. ఇంకేం... వేల కోట్లకు అధిపతి అయ్యాడు. మైన్ క్రాఫ్ట్ గేమ్‌ను అమ్మేసి కోట్లు గడించాడు. 
minecraft కోసం చిత్ర ఫలితం
ఇంతవరకూ బాగానే ఉంది. అతడి జీవితం మాత్రం గందరగోళంగా మారిపోయింది. అతడి చిన్నప్పటి జీవితం అంతా గతుకులమయం. తండ్రి తాగుబోతు. దాంతో మార్కస్ తల్లి అతడికి పన్నెండేళ్ల వయసున్నప్పుడు తాగుబోతు భర్తను వదిలేసి వెళ్లిపోయింది. తాగుడుకు బానిసైన తండ్రి దొంగతనాలకు అలవాటుపడ్డాడు. పోలీసులు అతడిని పట్టుకుని జైల్లో పెట్టారు. అతడు 2011లో తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు. సోదరి ఉండేది కానీ... ఆమె డ్రగ్స్ పిచ్చిలో ఎటు వెళ్లిపోయిందో ఆచూకి కూడా లేకుండా పోయింది. తనను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఏడాది తిరక్కుండా అతడి నుంచి విడిపోయింది. 
lankanta kompa... 15 vela kotla aasti...
మరో పేదరాలిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆమె కూడా ఓ సామాన్యుడితో కలిసి ఉడాయించింది. ఇలా అతడి జీవితంలో అందరూ పోయి ఒంటరిగా మిగిలిపోయాడు. డబ్బు మాత్రం వేల కోట్లు ఉన్నది. ఈ డబ్బేనా తనక్కావల్సింది... ఇందుకేనా తను రేయింబవళ్లు కష్టపడింది... అని తనలో తను అనుకుంటూ కుమిలిపోతున్నాడు మార్కస్. ఐతే ఇప్పుడతడు ఆనందాన్ని కొనుక్కుంటున్నాడు. సెలబ్రెటీలకు పార్టీలిచ్చి... పేదలకు సాయం అందిస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. భవిష్యత్తులోనైనా తనకు ఆనందమయ జీవితం దొరుకుతుందని భావిస్తున్నాడు.