జూలో మగ పిల్లకు జన్మనిచ్చిన ఖడ్గమృగం బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులోని ఖడ్గమృగం సరస్వతి శుక్రవారం ఒక మగ పిల్లకు జన్మనిచ్చింది. కాన్పూర్ జూ నుంచి మూడేళ్ల క్రితం జంతువు మార్పిడిలో భాగంగా సరస్వతి, సూరజ్ అనే ఖడ్గ మృగాలను జూకు తీసుకువచ్చారు.
జూకు వచ్చే నాటికే గర్భంతో ఉన్న సరస్వతి శుక్రవారం మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం బుల్లి ఖడ్గం మృగం బరువు 50 కిలోల ఉందన్నారు. జూపార్కు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 6న బుల్లి ఖడ్గమృగానికి నామకరణం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.