తప్పు ఎవరిది ... భార్యను పంపలేదని.. మామను..?

భార్యను పుట్టింట్లోనే ఉంచుకుని.. ఎన్నాళ్లయినా పంపడం లేదన్న కోపంతో పిల్లనిచ్చిన మామను కత్తితో పొడిచి చంపేశాడో అల్లుడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానె సమీపంలోని కలంబ్ అనే గ్రామంలో జరిగింది. దగ్డు రామ వాఘే అనే వ్యక్తి తన కూతురికి భగవాన్ అనే వ్యక్తిని ఇచ్చి రెండోపెళ్లి చేశాడు. 

ఆమె అంతకుముందు మొదటి భర్తకు విడాకులిచ్చింది. అయితే, భగవాన్ తన భార్యను తీసుకెళ్లడానికి రావడంతో సమస్య మొదలైంది. చాలాకాలంగా పుట్టింట్లోనే ఉంటున్న ఆమె, అత్తవారింటి వెళ్లేందుకు ససేమిరా అంటోంది. భగవాన్ ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడు ఆమె ఇంట్లో లేదు. ఇది అతడికి, అతడి ఆమమ వాఘేకు మధ్య గొడవకు కారణమైంది. 

అది కాస్తా చినికి చినికి గాలివానగా మారి, భగవాన్.. తన మామను కత్తితో పొడిచి చంపేసి, అక్కడినుంచి పారిపోయాడు. ఈ ఘటనపై వాఘే కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వాఘే మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, నిందితుని కోసం గాలిస్తున్నారు.