శ్రీకాకుళంలోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ (రిమ్స్)లో రేడియోగ్రాఫర్ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. ఈ ఆస్పత్రిలోని ఎక్స్‌రే విభాగానికి వచ్చే మహిళలను అతను వేధిస్తున్నట్టు తేలింది. ఎక్స్‌రే తీయాలంటే బట్టలన్నీ విప్పేయాలంటూ షరతు పెట్టాడు. ఎక్స్‌రే బాగా రావాలంటే బట్టలన్నీ విప్పక తప్పదంటూ చెబుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.
శ్రీకాకుళం జిల్లా రిమ్స్ ఆస్పత్రిలో ఎక్స్ రే విభాగంలో వెంటకరమణ అనే ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నాడు. రిమ్స్‌లోని ఎక్స్‌రే విభాగానికి ఓ యువతి ఎక్స్ రే తీయించుకునేందుకు వచ్చింది. ఎక్స్ రే బాగా రావాలంటే బట్టలు విప్పేయమని వేధించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఆ వ్యక్తిపై నిర్భయ చట్టం ప్రయోగించాలని కోరింది.