లింగపూజలు ఎన్ని?
లింగపూజ విశిష్టమైనదని శివపురాణ కథనం. లింగం ఆడుగున బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రభాగాన శివుడు ఉన్నందున లింగపూజ సర్వ దేవతారాధనం అవుతుంది.
చందన లింగం: మూడుపాళ్ళూ కుంకుమ, రెండుపాళ్ళూ కస్తూరి, నాలుగుపాళ్ళూ చందనం కలిపి శివలింగం చేస్తే, అది చందనలింగం అవుతుంది. ఈ లింగాన్ని పూజించడం శివసాయుజ్యకారకం. ఆ స్వామి అనుగ్రహాన్ని అందిస్తుంది.
పుష్పలింగం: మొగలి, సంపెంగ మినహా వివిధ పుష్పాలతో లింగాన్ని చేసి పూజిస్తే, రాజ్యం, పదవి సిద్ధిస్తాయి. అనుకున్నవి జరుగుతాయి.
సితాఖండలింగం: పటికబెల్లంతో చేసిన లింగం. దీనిని పూజిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది.

భస్మలింగం: సర్వఫలప్రదం.
వంశాంకురలింగం: వెదురు చిగుళ్ళతో చేసిన లింగం. ఈ లింగపూజ వంశవర్థకం.
దధి దుగ లింగం: నీళ్ళూ తీసేసిన పెరుగు, పాలు కలిపి చేసిన లింగంతో పూజించడం సర్వ సంపత్కరం.
దూర్వాకాండలింగం: గరికతో చేసిన లింగాన్ని పూజించడం అపమృత్యువును నివారిస్తుంది.
అష్టధాతు లింగం: సర్వసిద్ధిప్రదం.
పారదలింగం: పాదరసలింగం – ఐశ్వర్య ప్రదం.
స్ఫటిక లింగం: సర్వకామప్రదం.
లవణ లింగం: వశీకరణ సిద్ధిప్రదం.
తిలపిష్ట లింగం: రుబ్బిన నువ్వులముద్ద లింగం. దీనిని పూజిస్తే సమస్త కోరికలు తక్షణం నెరవేరుతాయి.