వాడి పారవేసే (యూజ్ అండ్ త్రో) ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం ప్రపంచవ్యాప్తంగా ఏటా పెరుగుతూ వస్తోంది. అమెరికాలో తలసరి ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగం 80 కేజీలు ఉండగా మన దేశంలో రెండు కేజీలు మాత్రమే. 100 బిలియన్ ప్లాస్టిక్ బ్యాగులు 12 మిలయన్ బ్యారళ్ల ఆయిల్‌తో సమానం. ఈ బ్యాగుల వినియోగంతో పర్యావరణం దెబ్బతినటంతో పాటు విలువైన ఇంధనం వృధా అవుతోంది.
రీయూజబుల్ బ్యాగులు
జనపనార తదితరాలతో చేసిన బ్యాగుల వాడకం భారీగానే ఉన్నప్పటికి ఇవి ప్లాస్టిక్ బ్యాగులకు ప్రత్యామ్నయం కాలేకపోయాయి. ఇవి పర్యావరణానికి అనుకూలమైనప్పటికి అంతగా ప్రాచుర్యం లభించలేదు.
నాన్ వోవెన్ ఫ్యాబ్రిక్ బ్యాగులు
పోలీ ప్రొపెలిన్ ప్రధాన ముడి పదార్థంగా తయారు చేయబడే ఈ బ్యాగులకు ఇటీవలి కాలంలో వ్యాపార వర్గాల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈప్లాస్టిక్ ద్వారా క్రింది రకాల బ్యాగులను తయారు చేయవచ్చు.
షాపింగ్ బ్యాగులు, ప్యాకింగ్ బ్యాగులు, ప్లెయిన్, ప్రింటెడ్ బ్యాగులు, భుజాలకు తగిలించుకునే ఫోల్డర్ , కిరాణా షాపులలో వాడే గ్రోసరీ బ్యాగులు, వైర్ బ్యాగులు. నాన్ వోవె న్ బ్యాగులు పూర్తిగా రీసైకిలింగ్‌కు అవకాశం ఉండటంతో పాటు దీర్ఘకాలం పాటు మన్నికనిస్తాయి.
మార్కెట్ అవకాశాలు
నాన్ వోవెన్ క్లాత్‌తో చేసిన బ్యాగులను అన్ని రకాలైన ఉత్పత్తుల ప్యాకింగ్‌కు వినియోగించే అవకాశం ఉంది. ప్లాస్టిక్ బ్యాగులకు ప్రత్యా మ్నాయంగా వీటిని అన్ని చోట్ల వినియోగించే వీలుంది. బ్యాగులపై ప్రింటింగ్ చేసుకునే వీలుండటంతో వ్యాపార వర్గాలకు ఇది అనుకూలంగా ఉంటుంది. నాణ్యత, బరువు, డిజైనింగ్‌ను బట్టి ఒక్కో బ్యాగు 6 రూపాయల నుంచి 80 రూపాయల ధర ఉండే విధంగా తయారు చేసి మార్కెట్ చేసుకునే వీలుంది.
తయారీ విధానం
నాన్ వోవెన్ క్లాత్ తయారు చేసే సంస్థల నుంచి క్లాత్‌ను సేకరించి బ్యాగులు తయారు చేసే ఆటోమేటిక్ యంత్రం లేదా సెమీ ఆటోమెటిక్ యంత్రాల ద్వారా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ సైజులలో బ్యాగులను తయారు చేయాల్సి ఉంటుంది. కొన్ని బ్యాగుల తయారీ యంత్రాలలో 4 లేదా 6 రంగుల్లో ప్రింటింగ్‌కు అవకాశం ఉండగా స్క్రీన్ ప్రింటింగ్ చేసుకునే ప్రత్యేక యంత్రాలు కూడా ఉన్నాయి.
పరిశ్రమ వివరాలు
పూర్తిగా ఆటోమేటిక్ యంత్రంతో బ్యాగుల తయారీ పరిశ్రమ
రోజుకు 20 వేల బ్యాగుల తయారీ సామర్థ్యం
పరిశ్రమ అంచనా వ్యయం : రూ. 60 లక్షలు
సెమీ ఆటోమేటిక్ యంత్రంతో బ్యాగుల తయారీ పరిశ్రమ
రోజుకు 5000 బ్యాగుల తయారీ పరిశ్రమ
పరిశ్రమ అంచనా వ్యయం : రూ. 15 లక్షల రూపాయలు