రెడీ టు ఈట్‌ ఫ్లేవర్డ్‌ కొబ్బరి చిప్స్‌ తయారి పరిశ్రమ



నిత్య జీవితంలో కొబ్బరి ఉపయోగం గురించి వునం దరికి తెలుసు. శీతలపానీయంగా కొబ్బరినీరు తాగడం, పూజాదికాల్లో కొబ్బరికాయలను వాడటం, ప్రసాదంగా పంపిణీ చేయడం గృహ, వ్యాపార సంస్థల్లో ఆహార పదార్థాల తయారీలో కొబ్బరి ఉపయోగం, కొబ్బరి స్వీట్స్‌ తయారీ గురించి తెలిసిందే. అదేవిధంగా చాక్లెట్లు, బిస్కెట్లు లాంటి ఆహార పదార్థాలు తయారుచేసే పరిశ్రమల్లో కొబ్బరిపొడి ఉపయోగిస్తారు.
ఫ్లేవర్డ్‌ కొబ్బరిచిప్స్‌
ఇటీవలకాలంలో స్నాక్స్‌ ఉత్పత్తుల వినియోగం బాగా వృద్ధి చెందడం, కొబ్బరిలో రుచికరమైన ఫ్లేవర్డ్‌ కొబ్బరి చిప్స్‌ తయారీ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. పరిపక్వం చెందిన కొబ్బరి కాయల నుంచి తీసిన తాజా కొబ్బరిని చిన్న చిన్న ఫ్లేక్స్‌/ముక్కలుగా చేసి వెనిల్లా లేదా పైనాపిల్‌ ఫ్లేవర్‌ను చేర్చి వేడి గాలిని ప్రసరింపచేయడం ద్వారా రుచికరమైన, సువాసన గల క్రిస్పి రెడీ టు ఈట్‌ చిప్స్‌ తయారుచేస్తారు. ఈ క్రిస్పి చిప్స్‌ను ప్లాస్టిక్‌ పౌచ్‌లలో నిర్ణీత పరిమాణాల్లో నింపి, నైట్రోజన్‌ వాయువు నింపి సీలింగ్‌ చేస్తారు. ఈ క్రిస్పి రుచికరమైన కొబ్బరి చిప్స్‌ 8 నెలల వరకు ఎప్పుడైనా తినడానికి అనుకూలంగా ఉంటాయి.
కొబ్బరి చిప్స్‌-వాస్తవాలు

  •      కొబ్బరి చిప్స్‌ అధిక యాంటి ఆక్సింఎట్స్‌, మినరల్స్‌, ల్యూరిక్‌ కలిగి ఉంటాయి. కాబట్టి ఆరోగ్యానికి వుంచిది.
  •      నూనెలో వేయించకుండా బేకింగ్‌ పద్ధతిలో తయారుచేయడం వల్ల సరైన రుచి కలిగి ఆరోగ్యకరంగా ఉంటాయి.
  •      స్నాక్స్‌ తినాలనే కోరికను సంతృప్తిపరుస్తాయి.
  •      ఈ చిప్స్‌ 100 శాతం స్వచ్ఛమైనవి, సహజమైనవి.
  •      సాధారణంగా పాలను చేర్చడం ద్వారా కొబ్బరి తినుబండారాలను తయారుచేస్తారు. ఈ చిప్స్‌ తయారీలో మాత్రంపాలు వాడకం ఉండదు.
  •      ఈ చిప్స్‌లో కొలెస్ర్టాల్‌ లేదా హాని కలిగించే కొవ్వు ఉండదు.
  •      ఇవి గ్లూటిన్‌ కలిగి ఉండని, పూర్తి శాఖాహార పదార్థం.
  •      అన్ని వయస్సుల వారికి తినడానికి అనుకూలం.
అవసరమైన యంత్ర పరికరాలు
కొబ్బరికాయ పగలగొట్టే యంత్రం, కొబ్బరి తీసే యంత్రం, స్లయిసింగ్‌ యంత్రం, ప్యాకింగ్‌ మిషన్‌, ఇతర పరికరాలు ఈ పరిశ్రవుకు అవసరం.

ముడి పదార్థాల లభ్యత
మన రాష్ట్రాల్లో కొబ్బరిపంట విస్తారంగా ఉండటం వల్ల కొబ్బరికాయల లభ్యత సమస్య కాదు. రైతుల నుంచి కొబ్బరికాయలను కొనడం ద్వారా లేదా అధిక సంఖ్యలో కొబ్బరిచిప్పలు లభ్యవుయ్యే దేవాలయాల నుంచి కొబ్బరిని సేకరించి, నాణ్యమైన తయారీ పద్ధతులను అనుసరించడం ద్వారా రుచికరమైన కొబ్బరిచిప్స్‌ తయారుచేసే పరిశ్రవును ఏ ప్రాంతంలోనైనా యువతీ యువకులు ప్రారంభించవచ్చు.

మార్కెటింగ్
రెడీ టు ఈట్‌ ఉత్పత్తి కావడం వల్ల వినియోగదారులకు సమీపంలో ఉండే సూపర్‌ మార్కెట్లు, కిరాణాషాపులు వంటి అన్నిరకాల వ్యాపార సంస్థల ద్వారా  మార్కెటింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సినిమా థియేటర్లు, రైల్వే, బస్‌స్టేషన్లలో ఉండే క్యాంటీన్లు, రిటైల్‌ షాపుల ద్వారా కూడా వుంచి వ్యాపారాన్ని పొందవచ్చు.
పరిశ్రమ వ్యయం

  •  ఉత్పత్తి సావుర్థ్యం: రోజుకు 25 కేజీలు / సంవత్సరానికి 7.5 మె.టన్నులు
  •  అవసరమైన కొబ్బరి: 200 కొబ్బరి కాయలు లేదా 400 కొబ్బరి చిప్పలు
  •  (పరిపక్వం చెందిన, తాజా పెద్ద చిప్పలు / కాయలు)
  •     పరిశ్రవు ప్రారంభ వ్యయం: రూ.15.00 లక్షలు