పాత పడిపోయిన బట్టలతో తలదిండ్లు(Pillows) ఎలా తయారు చేస్తారు?



pillows కోసం చిత్ర ఫలితం



   సాధారణంగా పాతపడిపోయిన స్వెట్టర్లను బయట పడేయడమో లేదా ఎవరికైనా ఇచ్చేయడమో చేస్తుంటాం.కాని వీటిని ఎంచక్కా దిండ్లలా ఎలా మలచుకోవచ్చో తెలుసుకుందాం.


pillows కోసం చిత్ర ఫలితం
ఊలు స్వెట్టర్లను శుభ్రంగా ఉతికి, గాలిలో బాగా ఆరనివ్వాలి. ఇప్పుడు ఒక మామూలు దిండు కవరు తీసుకుని, అందులో స్వెట్లర్లను నాలుగు మడతలు వచ్చేటట్లుగా పెట్టండి.

ఎగుడు దిగుడులు లేకుండా సమంగా ఓ స్వెట్టర్‌ను దిండు కవరులో సర్దండి. కవరు తెరచి ఉన్నవైపు నుంచి లోపలి స్వెటర్‌ కనబడకుండా కుట్లు వేయండి.

దీంతో సరికొత్త దిండు తయారైపోతుంది. అలా తయారు చేసిన తలగడపైన మరో అందమైన కుషన్‌ కవర్‌ వేసినట్లయితే సోఫాలోకి సరికొత్త మెత్తటి తలగడ రెడీ.