అత్యాచారం చేస్తే ఐదు చెప్పు దెబ్బలు , రూ. 50 జరిమానా?



సభ్య సమాజం తలదించుకునే రీతిలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. దీంతో అత్యాచారాలకు పాల్పడే మృగాళకు వేసే శిక్షలను మరింత కఠినతరం చేయాలని ఒక వైపు దేశమంతా గగ్గోలుపెడుతుంటే అక్కడ మాత్రం అత్యాచారం చేస్తే ఐదు చెప్పు దెబ్బలు కొట్టి, రూ. 50 జరిమానా విధిస్తారు. 

అదీ హర్యానాలోని ఓ పంచాయతీ పెద్దలు నిర్వాకం. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జకోపూర్ గ్రామంలో 15 ఏళ్ల అమ్మాయి నీళ్ల తెచ్చేందుకు బోరు పంపు వద్దకు వెళ్లింది. బంధువులయిన మునాఫత్, జబీద్ ఆమెను బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. బాధితురాలి జరిగిన విషయంలో ఇంట్లో చెప్పింది. 

ఈ విషయం పంచాయతీ పెద్దలకు వద్దకు వెళ్లింది. అయితే ఆ పెద్దలు అమ్మాయిని అత్యాచారం చేసిన ఇద్దరు వ్యక్తులను ఐదుసార్లు చెప్పు దెబ్బలు కొట్టాలని, వారి నుంచి 50 వేల రూపాయల చొప్పున జరిమానా వసూలు చేయాలని శిక్ష విధించారు. కాగా బాధిత కుటుంబం పంచాయతీ తీర్పును వ్యతిరేకిస్తూ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.