టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ అయిన అనుష్క మోసపోయిందా..? ఇంతకి ఆ మోసం ఏంటి..? అనుకుంటున్నారా..! అయితే
రాజమౌళి మూడేళ్ళ క్రితం బాహుబలి స్టొరీ చెప్పినప్పుడు అనుష్క ఆనందానికి
అవదులేకుండాపోయాయట.. సినిమా మొత్తం తనచుట్టూనే తిరుగుతుందని తెగ సంబరపడిందట. వరుస చిత్రాలతో
బిజీ గా ఉన్న కానీ రాజమౌళి కి కాల్షీట్లు కేటాయించింది. తెలుగు, తమిళ్ నుండి ఎన్నో
పెద్ద ఆఫర్లు వచ్చినప్పటికీ అవన్నీ బాహుబలి ముందు బేజారు అని పక్కనపెట్టేసింది. కానీ
సినిమా రిలీజ్ అయ్యాక తెల్సింది అమ్మడికి అసలు సినిమా ఏంటో. బాహుబలి మొదటి పార్ట్ లో
అనుష్క కు పెద్దగా స్కోప్ ఇవ్వలేదు రాజమౌళి. సినిమా చూస్తే ఆ సంగతి ఎవరికైనా ఇట్టే
అర్థమైపోతుంది.
మొదటి పార్ట్ లో కేవలం అనుష్క పాత్ర 15 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు..డైలాగులు
కూడా ఎక్కువగా ఇవ్వలేదు.. కనీసం బాహుబలి -2 లో అయిన అనుష్కకు ఫుల్ స్కోప్ ఇస్తాడేమో
అని అబిమానులు ఆశపడుతున్న ఆ ఆశలు కూడా అడియాసలే అంటున్నారు ఫిలిం నగర్ వాసులు..పార్ట్-2లో
కూడా అనుష్క పాత్రను పైపైనే తేల్చేసే ప్లాన్ లో ఉన్నాడు రాజమౌళి. రానా, ప్రభాస్, కట్టప్ప
పాత్రలను ఫోకస్ చేస్తూ యుద్ధాలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు వార్త. దీంతో అనుష్కకు
రాజమౌళి మీద పీకలోతు కోపం తో ఊగిపోతుందట.
కనీసం రమ్యకృష్ణ పాత్రకు వచ్చినంత క్రేజ్ కూడా తన క్యారెక్టర్ కు ఇవ్వలేదని
తన సన్నిహితుల దగ్గర వాపోతుందట. అందుకే బాహుబలి ప్రమోషన్ కు అనుష్క డుమ్మా కొట్టిందంటున్నారు
చిత్ర యూనిట్. అనుకున్నది ఒక్కటి. అయినది ఒక్కటి అన్నట్లుగా తయారైంది అనుష్క పరిస్థితి.
చూద్దాం సెకండ్ పార్ట్ లో రాజమౌళి అనుష్క కు ఎంత న్యాయం చేస్తాడో.