బన్నీ క్షేమమే.. కానీ..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తీవ్ర గాయాలై యశోదా ఆసుపత్రిలో చికిత్స పొండుతున్నారన్న వార్త ప్రస్తుతం మెగా అభిమానులను కలవరానికి గురి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ అర్జున్ చికిత్స కొరకు తాము హాస్పిటల్ కు రాలేదని తెలిపారు. 

అలాగే బన్నీ ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని, బన్నీకి చిన్నపాటి ఆరోగ్య సమస్య కూడా లేదని అరవింద్ తేల్చి చెప్పారు. ఇక గతంలో జరిగిన ప్రమాదంలో అల్లు అర్జున్ భార్య స్నేహలతా రెడ్డి గాయపడ్డారని, ఈ క్రమంలోనే ఆమెకు శస్త్ర చికిత్స చేయించేందుకు ఆసుపత్రికి వచ్చామని అరవింద్ వివరించారు. కాగా నేటి సాయంత్రంలోగా స్నేహాలతా రెడ్డికి ఆపరేషన్ పూర్తికానున్నదని, వెంటనే డిశ్చార్జి కూడా చేస్తారని అల్లు అరవింద్ స్పష్టం చేశారు.