కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఆ పార్టీ యువరాజు రాహుల్ గాంధీకి మరో యేడాది పాటు అప్పగించవద్దని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి అత్యంత ప్రధానమైన అనుచరులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి తగినంత మెజార్టీ లేదని, అందువల్ల వివిధ అంశాలపై మిత్రపక్షాలను కలుపుకుని ముందుకు సాగే అనుభవం, సామర్థ్యం లేదని వారి వాదనగా ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
వాస్తవానికి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రాహుల్‌కు అప్పగిస్తారనే ఊహాగానాలు బలంగా వినొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోనియా గాంధీనే మరో యేడాది పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారని పార్టీ వర్గాల సమాచారం. దీనికి ప్రధాన కారణం అనుభవలేమి.
పైగా పార్లమెంట్‌లో బలంగా ఉన్న అధికార పక్షాన్ని ఎదుర్కోవడంలోనూ అలాగే, ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలోనూ రాహుల్‌కున్న అనుభవం సరిపోదని వారి అభిప్రాయంగా ఉంది. అందువల్ల మరో ఏడాది తర్వాత ఆయనకు బాధ్యతలిస్తే మేలని కూడా సూచించినట్లు తెలిసింది.